సెన్సార్ పనులు ముగించుకున్న ‘రంగస్థలం’ !

26th, March 2018 - 03:32:18 PM

సుకుమార్ దర్శకత్వంలో 1985 కాలం నాటి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం ‘రంగ‌స్థలం’. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత, ఆది పినిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన ఈ చిత్రం మార్చి 30న విడుద‌ల కానుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సట్టిఫికేట్ పొందింది. ఈ మూవీకి సంభందించి మరో ఫంక్షన్ హైదరాబాద్ లో ఈ రెండు రోజుల్లో జరగనుంది.

గ్రామీణ నేపద్యలో ఉండే వాతావరణం, అక్కడి ప్రజల మనస్తత్వాలు ఈ సినిమాలో క్లుప్తంగా చూపించడం జరిగిందని తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ పై అటు అభిమానుల్లో, ఇటు సినిమా పరిశ్రమలో మంచి అంచనాలున్నాయి.