రంగస్థలం రెండో పాటకు మంచి స్పందన !
Published on Mar 2, 2018 7:19 pm IST

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటిస్తోన్న రంగస్థలం సినిమాలోని మొదటిపాట ఎంత సక్కగున్నవే పాటకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. చంద్రబోస్ రాసిన ఆ పాటలోని లిరిక్స్ బాగున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆకట్టుకుంది. అదే తరహాలో రెండో పాట ఉంది. ఈరోజు విడుదల చేసిన రంగా రంగా స్థలానా పాట కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది.

సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అనసూయ, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆది పినిశెట్టి చరణ్ అన్న పాత్రలో కనిపించబోతున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మర్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రంగా రంగా స్థలానా పాట కొరకు క్లిక్ చేయండి

 
Like us on Facebook