‘రంగస్థలం’ స్పెషల్ సాంగ్ ఈరోజు నుండే !

5th, February 2018 - 01:29:06 PM

రామ్ చరణ్ చేస్తున్న ‘రంగస్థలం’ సినిమాలో ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ చేయనున్న సంగతి తెలిసిందే. టాకీ పార్ట్ మొత్తం ముగించిన టీమ్ ఈరోజు నుండి ఈ స్పెషల్ పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసున్నారు.

యూనిట్ సమాచారం ప్రకారం ఈ పాట మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని, సుకుమార్ గత చిత్రాలోని ‘అ.. అంటే అమలాపురం, లండన్ బాబు’ పాటల్లానే ఈ పాట కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 30న విడుదలకానున్న ఈ చిత్రంలో చరణ్ పూర్తిస్థాయి వినికిడి లోపం ఉన్న ప్రయోగాత్మక పాత్రలో కనిపించనున్నాడు.