వెంకీ మామలో రాశి కొత్తగా ట్రై చేసిందా…?

Published on Aug 24, 2019 2:48 pm IST

ఎన్టీఆర్ తో జై లవకుశ వంటి హిట్ మూవీ తరువాత దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం వెంకీ మామ. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశి కన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కానుంది.

వెంకటేష్, చైతు మామా అల్లుళ్లుగా నటిస్తున్న ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రాశి ఖన్నా కూడా ఈ చిత్రంలో పల్లెటూరి అల్లరి పిల్లగా కనిపించనుంది. నేడు వెంకీ మామ చిత్ర సెట్స్ నుండి బయటకొచ్చిన ఫొటోలో ఆమె లంగా ఓణీలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది.గతంలో రాశి ఎప్పుడూ పల్లెటూరి అమ్మాయిగా చేసిన దాఖలాలు లేవు. విక్టరీ వెంకటేష్ తో ఉన్న ఆ ఫోటో ఆసక్తికరంగా ఉంది.

సంబంధిత సమాచారం :