ఇంటర్వ్యూ : రష్మికా మండన్న – హార్డ్ వర్క్ వల్లే అవకాశాలు వస్తున్నాయి.

ఇంటర్వ్యూ : రష్మికా మండన్న – హార్డ్ వర్క్ వల్లే అవకాశాలు వస్తున్నాయి.

Published on Jul 23, 2019 3:20 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మికా మండన్న రెండవ సారి జంటగా ‘డియర్ కామ్రేడ్’తో ఈ నెల 26న రాబోతున్నారు. కాగా రష్మికా మండన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి రష్మికా మండన్న వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం..

 

డియర్ కామ్రేడ్ గురించి చెప్పండి ?

‘డియర్ కామ్రేడ్’ భావోద్వేగాలతో సాగే ఒక ఎమోషనల్ ఫిల్మ్. సినిమాలోని ఎమోషన్ మరియు మెసేజ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ గాని, విజయ్ క్యారెక్టర్ గాని.. ఆ రెండు క్యారెక్టర్ ల మధ్య జర్నీ గాని సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది.

 

సినిమాలో మీ పాత్ర గురించి ?

లిల్లీ అనే స్టేట్ లెవల్ క్రికెటర్ పాత్రలో నటించాను. తను బాబీ అనే అతనితో ప్రేమలో పడితే.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎలాంటివి, బాబీతో తన లైఫ్ అండ్ లవ్ జర్నీ ఎలా సాగింది అనేదే సినిమా.

 

మీకు క్రికెట్ గురించి ఇంతకుముందే అవగాహన ఉందా ?

నిజం చెప్పాలంటే.. క్రికెట్ గురించి నాకు ఏమి తెలియదు. డియర్ కామ్రేడ్ లోని లిల్లీ పాత్ర వల్లే.. నేను క్రికెట్ గురించి బేసిక్స్ తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు నా వికెట్ పడకుండా మ్యానేజ్ చెయ్యగలను. అలా అని సిక్స్ లు కొట్టమంటే కష్టం.. ఇప్పటికైతే ఫోర్ లు చాలసార్లు కొట్టాను.

 

అన్ని భాషల్లో మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పారా ?

లేదండి. నేను కన్నడ అండ్ తెలుగులో చెప్పాను. తమిళ్ అండ్ మలయాళంలో వేరేవాళ్లు చెప్పారు. తమిళ్ అండ్ మలయాళంలో కూడా నేను వరుసగా సినిమాలు చేస్తే.. ఆ భాషలు నేర్చుకుని అక్కడ కూడా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తాను.

 

మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రావడం లక్కీగా ఫీల్ అవుతున్నారా ?

నేను లక్కీ అని అనుకోవడం లేదు. ఎలాంటి అవకాశాలైన హార్డ్ వర్క్ వల్లే వస్తాయి. నేను హార్డ్ వర్క్ చెయ్యడం వల్లే నాకు మంచి అవకాశాలు వస్తున్నాయని ఫీల్ అవుతున్నాను.

 

మహేష్ బాబుతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది ?

‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ షెడ్యూల్ లో నా రోల్ కి సంబంధించి ఎలాంటి షూట్ లేదు. దాంతో మహేష్ గారితో కలిసి వర్క్ చేయలేకపొయాను. తరువాత షెడ్యూల్ లో ఆయనతో కలిసి నటించడానికి చాలా ఎగ్జైట్ గా ఉన్నాను. అయితే ఇప్పటివరకూ మహేష్ గార్ని ఒకసారి కలిశాను. చాల హ్యాపీగా అనిపించింది. అయన దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు.

 

ఈ సినిమాని విజయ్ దేవరకొండ కోసమే అంగీకరించారా ?

అదేంలేదండి. విజయ్ దేవరకొండ కోసమో, మరొకరి కోసమో నేను సినిమా ఒప్పుకోలేదు. స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు బాగా నచ్చింది. తరువాత ఏమి జరుగుతుందనే ఇంట్రస్ట్ సినిమాలో ప్రతి సన్నివేశంలో కనిపిస్తోంది. దాంతో సినిమా చెయ్యడానికి అంగీకరించాను.

 

డైరెక్టర్ గురించి చెప్పండి ?

భరత్ సర్… ఆయనకి స్క్రిప్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంది. ఫస్ట్ ఆయన నాకు స్క్రిప్ట్ మెయిల్ చేశారు. కానీ నేను చదవలేదు. ఆ తరువాత ఆయన స్టోరీ చెప్పినప్పుడు నాకు చాల బాగా నచ్చింది.

 

‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్స్ ను చాల కొత్తగా చేస్తున్నారు. అందుకో మీరు కూడా భాగమే. ఎలా అనిపిస్తోంది ?

‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్స్ బాగున్నాయి అని చాలామంది అంటున్నారు. సినిమాకి ప్రమోషన్స్ చాల ఇంపార్టెంట్ కదా. అయితే ఆ కొత్తగా చేస్తోన్న ప్రమోషన్స్ ఐడియా నాది కాదు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రమోషన్స్ పాల్గొనాలి కాబట్టి నేను పాల్గొన్నాను. ఆ క్రెడిట్ మొత్తం విజయ్ కి అండ్ డైరెక్టర్ గారికే ఇవ్వాలి. వాళ్ళే ప్రమోషన్స్ ను అలా ప్లాన్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు