దేవరకొండతో రెండో సినిమా చేయనున్న రష్మిక ?

రష్మిక మందన్న.. ప్రస్తుతం టీ-టౌన్లో బాగా వినిపిస్తున్న పేరు. గత వరం విడుదలైన నాగ శౌర్య ‘ఛలో’ చిత్రంతో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుందీ కన్నడ హీరోయిన్. సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారు తెలుగు పేక్షకులు. ఈ సినిమా విడుదలకు ముందే లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేసిన రష్మిక ఇప్పుడు మరో సినిమా కూడా చేసే అవకాశలున్నట్లు తెలుస్తోంది.

విజయ్ ‘పెళ్లి చూపులు’ చిత్ర నిర్మాత యాష్ రంగినేని నిర్మాణంలో ఒక చిత్రాన్ని చేయనున్నాడు. ఈ సినిమాను నూతన దర్శకుడు భరత్ కమ్మ డైరెక్ట్ చేయనున్నాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ సినిమాలో రష్మిక అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. కాబట్టి అన్నీ కుదిరితే రష్మిక రెండోసారి విజయ్ సరసన నటించవచ్చు.