న్యూ ఇయర్ సందర్బంగా విడుదలైన రవి తేజ క్రాక్ మూవీ ట్రైలర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ ఈ సారి తప్పకుండా విజయం అందుకోనున్నట్లుగా ట్రైలర్ తో అర్ధమవుతుంది. ఈ రోజు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ని క్రాక్ చిత్ర బృందం అభిమానులకి అందించింది. క్రాక్ మూవీ రిలీజ్ పోస్టర్ ని రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. యు/ఏ సెర్టిఫికెట్ తెచ్చుకుని జనవరి 9 న విడుదవబోతున్నట్లుగా ఈ పోస్టర్లో కనిపిస్తుంది.
మొదట సంక్రాంతి సీజన్లో వద్దామని అనుకున్నప్పటికీ మరికొన్ని పెద్ద సినిమాలతో పోటీ పడటం ఎందుకని క్రాక్ చిత్రాన్ని ఒక వారం ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ వర్గాల నుండి తెలుస్తుంది. ఈ చిత్రంలో రవితేజ పోలీసు పాత్రలో నటించనుండగా ఆయన సరసన శృతుహాసన్ కథానాయికగా నటిస్తుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ మీద భారీగానే అంచనాలున్నాయి. తమన్ ఎస్ ఈ చిత్రానికి ట్యూన్స్ కంపోజ్ చేయనున్నారు.


