రవి తేజా లుక్ లో మరీ ఇంత మార్పా…!

Published on Aug 24, 2019 12:19 pm IST

మాస్ మహరాజ్ రవి తేజ త్వరలో డిస్కో రాజాగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు వి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫిక్షనల్ జోనర్ లో రూపొందుతుంది. రవి తేజ సరసన ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ నటిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

కాగా నేడు ఈ చిత్రంలోరవి తేజ లుక్ కి సంబంధించి ఓ ఫోటో బయటకి రావడం జరిగింది. ఆ ఫోటోలో రవితేజ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. షూటింగ్ సమయంలో ఓ అభిమానితో దిగిన ఆ ఫోటోలో రవి తేజ గుర్తుపట్టలేనంతలా ఉన్నారు. డిస్కో రాజా మూవీలో రవి తేజా విభిన్న గెట్ అప్స్ లో కనిపిస్తారని సమాచారం. వాటిలో యంగ్ బాయ్ లుక్ ఒకటని తెలుస్తుంది. కాగా ఈ చిత్రం విడుదల తేదీ త్వరలో ప్రకటించే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :