“రాజ రాజ చోర” సినిమాకు మరింత బూస్టప్ ఇచ్చిన రవితేజ..!

Published on Aug 21, 2021 1:15 am IST

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో శ్రీ విష్ణు హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజ రాజ చోర’ సినిమా ఆగష్ట్ 19వ తేదిన విడుదలై మంచి సక్సెస్‌ను సాధించడమే కాకుండా, ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమాకు హీరో రవితేజ మరింత బూస్టప్ ఇచ్చాడు.

తాను “రాజ రాజ చోర” సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేశానని ట్విట్టర్ ద్వారా తెలిపిన రవితేజ మంచి వినోదాత్మక మరియు భావోద్వేగ చిత్రమైన చిత్రం ఇదని, శ్రీ విష్ణు మరియు దర్శకుడు హసిత్ గోలీకి కంగ్రాట్స్ చెబుతూ, మొత్తం చిత్ర బృందానికి అభినందనలు తెలియచేశాడు. ఇకపోతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాశ్, సునైన నటించగా, మై విలేజ్ ఫేమ్ గంగవ్వ ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

సంబంధిత సమాచారం :