రవితేజ తమ్ముడు మృతి !


స్టార్ హీరో రవి తేజ్ తమ్ముడు భరత్ రాజు నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సంసహాబాద్ మండలం కొత్వాల్ గూడ వద్ద ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న లారీని భరత్ కారు వెనుక నుండి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

46 ఏళ్ళ వయసున్న భరత్ శంషాబాద్ నుండి నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమదం జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నారు. భరత్ పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేసి నటుడిగా మంచి గుర్తింపు కూడా పొందాడు. ఆయన మృతి పటేల్ 123తెలుగు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తోంది.