ఫ్లోలో వెళ్ళిపోతానంటున్న రవితేజ !

31st, January 2018 - 09:03:26 AM

స్టార్ హీరో రవితేజ ఏడాది గ్యాప్ తరవాత చేసిన ‘రాజా ది గ్రేట్’ మంచి సక్సెస్ సాధించడంతో అదే విజయాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో వెంటనే ‘టచ్ చేసి చూడు’ అనే సినిమాతో ఫిబ్రవరి 2వ తేదీన ఆయన ప్రేక్షకుల ముందుకురానున్నారు. దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ఒక సినిమాను ఇప్పటికే 25 శాతం ముగించిన ఈ సీనియర్ హీరో త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా చేయనున్నారు.

ఈ చిత్రాల తర్వాత కూడా వరుస స్క్రిప్ట్స్ ను ఓకే చేసిపెట్టుకున్న మాస్ మహారాజ ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలనేం టార్గెట్ పెట్టుకోలేదని, తన వద్దకు వచ్చిన మంచి స్క్రిప్ట్స్ నే చేసుకుంటూ ఫ్లోలో వెళ్ళిపోతానని, ఇకపై భిన్నమైన స్క్రిప్ట్స్ కూడా చేస్తానని అన్నారు. అంతేగాక శుక్రవారం విడుదలకానున్న ‘టచ్ చేసి చూడు’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.