రవితేజ ఇంకో రెండేళ్లు దొరకడు

Published on May 4, 2021 10:00 pm IST

మాస్ మహారాజ్ రవితేజ స్పీడ్ మాములుగా ఉండదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఏడాదికి మూడు సినిమాలు చేయగల ఎనర్జీ ఆయనది. ప్రస్తుతం ఆయన అదే ప్లానింగ్లోనే ఉన్నారు. ఈ సంవత్సరం ‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రజెంట్ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ చేస్తున్నారు. ఇంకొద్దిగా షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇది పూర్తయ్యాక వరుసగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక చిత్రం, శరత్ మండవ డైరెక్షన్లో ఒక చిత్రం చేయనున్నారు.

ఇవి కంప్లీట్ అయ్యాక బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు అనిల్ రావిపూడితో కూడ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఇవి కాకుండా ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా మొత్తంగా ఐదారు కొత్త సినిమాలను ట్రాక్లో పెట్టి ఉంచారు రవితేజ. వీటిలో ఎంతలేదన్నా నాలుగు మాత్రం కన్ఫర్మ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీన్నిబట్టి ఇంకో రెండేళ్లు రవితేజ దొరకడం దాదాపు అసాధ్యమే అనాలి.

సంబంధిత సమాచారం :