‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ వంటి హిట్ సినిమాలు రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చాయి. మళ్ళి వీరిద్దరుకలిసి సినిమా చెయ్యబోతున్నారు. ఏప్రిల్ నుండి వీరి సినిమా ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలో ఈ సినిమాకు సంభందించిన అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. గతంలో తమన్ , రవితేజ కలిసి చాలా సినిమాలకు పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతోంది. రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్ సినిమాలో నటిస్తున్నాడు. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.


