మాస్ మహారాజ్ “ఖిలాడి” కూడా ఈ లిస్ట్ లోకి.!

Published on May 5, 2021 12:00 pm IST

ఈ ఏడాది టాలీవుడ్ కే కాకుండా టోటల్ సౌత్ ఇండియన్ సినిమాకే తన చిత్రం “క్రాక్” హిట్ తో మంచి బూస్టప్ ను ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంతో రవితేజ మంచి కం బ్యాక్ అందుకోడమే కాకుండా తన కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లను రాబట్టారు.

ఇక ఆ సినిమా విజయం టైం లోనే దర్శకుడు రమేష్ వర్మతో స్టార్ట్ చేసేసిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడి”. మాస్ మహారాజ్ స్పీడ్ కు తగ్గట్టుగానే ఈ చిత్రం షూట్ కూడా జెట్ స్పీడ్ తో ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేసారు. మొత్తం ఫినిష్ చేసేసి ఈ మే నెలలోనే విడుదలకు ప్లాన్ చేశారు.

కానీ ఊహించని సెకండ్ వేవ్ మూలాన వాయిదా పడ్డ అనేక సినిమాల లిస్ట్ లోకి ఈ చిత్రం కూడా చేరిపోయింది. ఈ సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. అలాగే కొత్త డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్టుగా కూడా తెలిపారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ మూవీస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :