రవితేజ తో సంపత్ నంది ఫిక్స్ అయిందా ?

రవితేజ తో సంపత్ నంది ఫిక్స్ అయిందా ?

Published on Sep 11, 2022 10:40 PM IST

డైరెక్టర్ సంపత్ నంది రవితేజతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజకి సంపత్ నంది ఓ కథ చెప్పాడని, రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారని, ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

మరి రవితేజ ఇమేజ్ కోసం సంపత్ నంది ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య సంపత్ నంది గోపీచంద్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, రవితేజ అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని సంపత్ నంది ఫీల్ అవుతున్నాడట. ఏది ఏమైనా ‘సంపత్ నంది’ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది. ఇక రవితేజ ధమాకా, రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు