అన్ని అంశాలను టచ్ చేసిన రవితేజ !

మాస్ మహారాజ రవితేజ చేస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. ‘రాజా ది గ్రేట్’ తో హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ ‘టచ్ చేసి చూడు’తో కూడా ఆ సక్సెస్ నే రిపీట్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మరీ చేశారు. ఈ చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అందులో కంటెంట్ ను చూస్తే చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోందని అనిపిస్తోంది.

ఎందుకంటే ట్రైలర్లో యాక్షన్ తో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్, కామెడీ సమపాళ్లలో ఉన్నాయి. సినిమా కూడా ఇదే విధంగా ఎంటర్టైనింగా ఉంటే రవితేజ ఖాతలో మరో హిట్ ఖాయం. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) వల్లభనేని వంశీ మోహన్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా రాశీ ఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి :