డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు రవితేజ ‘ఖిలాడీ’ డిజిటల్ రైట్స్..!

Published on Aug 22, 2021 3:00 am IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ “ఖిలాడీ”. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోశిస్తున్న రవితేజ సరసన డింపుల్ హయతి మరియు మీనాక్షి దీక్షిత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురుంచి తాజాగా ఓ అప్డేట్ బయటకొచ్చింది.

ఈ సినిమా త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫాన్సీ ధర కోసం కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

సంబంధిత సమాచారం :