అమెరికాలో మొదలుకానున్న రవితేజ, శ్రీను వైట్ల చిత్రం !

మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈసారి ఆయన తర్వాత చేయబోయే సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ అనే సినిమా చేస్తున్న ఆయన శ్రీను వైట్ల డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు.

ఈ చిత్రం ఈ నెల 19 నుండి అమెరికాలో ప్రారంభంకానుంది. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే భిన్నమైన టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రంలో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రవితేజ ఏప్రిల్ నెల నుండి షూటింగ్లో పాల్గొననున్నారు.