నార్త్ సహా మరిన్ని భాషల్లో రిలీజ్ కి సిద్ధమైన “రజాకార్”

నార్త్ సహా మరిన్ని భాషల్లో రిలీజ్ కి సిద్ధమైన “రజాకార్”

Published on Apr 16, 2024 7:29 PM IST

రీసెంట్ గా వచ్చిన పలు నిజ జీవిత సంఘటనల ఆధార చిత్రాల్లో బాబీ సింహా, వేదిక, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో దర్శకుడు దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ చిత్రం “రజాకార్” కూడా ఒకటి. మరి తెలంగాణా చరిత్రలో జరిగిన ఓ దారుణ అధ్యాయం ఆధారంగా నేటి తరానికి గుర్తు చేస్తూ చేసిన ఈ సినిమా తెలుగులో మంచి ఆదరణను అందుకుంది.

అయితే మేకర్స్ మొదట్లోనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ కి అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఫుల్ ఫ్లెడ్జ్ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి ఈ చిత్రం సిద్ధం అయ్యింది. మేకర్స్ తాజాగా హిందీ, మరాఠీ సహా మన దక్షిణాది భాషల్లో కూడా సినిమాని ఈ ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ వారు నేషనల్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు