యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నఆర్ఎక్స్ 100 భామ టీజర్.

Published on Aug 31, 2019 12:51 pm IST

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్. ఆ చిత్రం సంచలన విజయం సాధించినా, ఆ స్థాయిలో అవకాశాలైతే ఈ భామకు దక్కలేదు. ఆమె తాజాగా ఆర్ డి ఎక్స్ లవ్ అనే చిత్రంలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఆ చిత్ర టీజర్ లో పాయల్ ఆర్ ఎక్స్ 100 కు మించి, అందాలు ఆరబోసినట్టున్నారు. దానికి తోడు చిత్రం కూడా అడల్ట్ కంటెంట్ తో కొంచెం ఘాటుగా ఉంటుందని అర్థం అవుతుంది. ఈ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో 2.5మిలియన్స్ వ్యూస్ సాధించి సంచలంగా మారింది.

ఒక చిన్న చిత్రానికి ఇన్ని లక్షల వ్యూస్ రావడం చెప్పుకోదగ్గ విషయమే. పాయల్ సరసన తేజు కంచర్ల నటిస్తుండగా, సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తునారు. ఇక ఈ చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :