కమల్ హాసన్ కారు మీద జరిగిన దాడి వెనుక అసలు నిజం

Published on Mar 15, 2021 11:00 pm IST

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. రానున్న తమిళనాడు ఎన్నికల్లో కమల్ యొక్క ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ కూడ పోటీచేస్తోంది. దీంతో కమల్ చాలా రోజుల నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న కూడ ఆయన కాంచీపురంలో రోడ్ షో నిర్వహించారు. అది ముగిశాక హోటల్ కు తిరిగి వెళుతున్న సమయంలో ఆయన కారును గుర్తు తెలియని వ్యక్తి అడ్డగించాడు. కమల్ కూర్చున్న సీట్ దగ్గరి విండో మీద బలంగా కొట్టి డ్యామేజ్ చేశాడు.

ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసుల ఆ గుర్తు తెలియని వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఆ విచారణలో అతను కమల్ మీద దాడి చేయడానికి రాలేదని, అతను కమల్ కు వీరాభిమాని అని కేవలం ఆయన్ను కలిసే ప్రయత్నంలోనే అలా చేశాడని, ఆ సమయంలో మద్యం సేవించి ఉండటం వల్లనే అంత గందరగోళం జరిగిందని తెలిసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు అతన్ని వదిలేశారు. ఇకపోతే కమల్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమా చేస్తున్నారు. ఎన్నికల పనులు ముగియగానే కమల్ తిరిగి షూటింగ్లో పాల్గొంటారు.

సంబంధిత సమాచారం :