చిరుకు ఆ దర్శకుడు సారీ ఎందుకు చెప్పాడంటే..!

20th, July 2016 - 07:49:27 PM

kodandarami-reddy
గత కొన్ని రోజులుగా తెలుగు పరిశ్రమలో ఓ వివాదం హాట్ టాపిక్ గా మారింది. అలనాటి అగ్ర దర్శకుడు, చిరంజీవితో 23 సినిమాలు చేసిన ‘కోదండరామిరెడ్డి’ చిరు 150వ సినిమాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత వాటిని వెనక్కు తీసుకుంటూ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ ఆ క్షమాపణ వెనుకున్న అసలు కారణం బయటపడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు కోదండరామి రెడ్డి రెండు రోజులుగా మెగా అభిమానుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ అందుకుంటున్నాడని, అందుకే బయటకొచ్చి క్షమాపణ చెప్పాడని తెలుస్తోంది.

ఇకపోతే సినీ జనాల నుండి వినిపిస్తున్న మాటల ప్రకారం కోదండరామిరెడ్డి కావాలని చిరుపై వ్యాఖ్యలు చేయలేదని, చిరుతో అన్ని హిట్ సినిమాలు తీసిన అనుభవం ఉన్న ఆయనకు జనాల పల్స్ ఏమిటో బాగా తెలుసని ఆ అనుభవంతోనే చిరు సందేశాత్మక చిత్రం తీయడం కన్నా కామెడీ ఓరియంటెడ్ సినిమా తీస్తే జనాలు ఆదరిస్తారన్న ఉద్దేశ్యంతో ఆ మాటలు చెప్పారట కానీ చిరుని దేవుడిగా భావించే కొందరు అభిమానులకు అవి వేరేగా అర్థమవడం వల్ల ఈ వివాదమంతా రేగిందని అభిప్రాయపడుతున్నారు. ఇది ఏమైనా దర్శకుడు కోదండరామిరెడ్డి గారు స్వయంగా బయటికొచ్చి ఈ వివాదానికి ఫులుస్టాప్ పెట్టడమనేది అభినందించదగ్గ విషయమే.