‘స్పైడర్’ ఆలస్యానికి అసలు కారణం !
Published on Jul 9, 2017 7:22 pm IST


సూపట్ స్టార్ మహేష్, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘స్పైడర్’. టీజర్ తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఇది వరకే విడుదలవాల్సి ఉండగా వాయిదాపడి సెప్టెంబర్ 27న వస్తోంది. ఇంతలా ఆలస్యమవడానికి వెనుక ఏవేవో కారణాలున్నాయని రకరకాల పుకార్లు వినవబడ్డాయి. కానీ ఈ ఆలస్యానికి అసలు కారణం ఏమిటో ఇప్పడు బయటకొచ్చింది.

అదేమిటంటే ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళంలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అంటే ఒకే షాట్ కు రెండు భాషల్లో డబ్బింగ్ చెప్పడం కాకుండా రెండు భాషలకు రెండు సార్లు సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారట మురుగదాస్. అందుకే సినిమా పూర్తవడం ఆలస్యమైందని తెలుస్తోంది. మురుగదాస్ పాటిస్తున్న ఈ ఖచ్చితత్వం ముందు విడుదల ఆలస్యం పెద్ద విషయమేమీ కాదని అనిపిస్తోంది. మహేష్ ఇంటెలిజెంట్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గాను, ఎస్.జె సూర్య, భరత్ లు విలన్లుగాను కనిపించనున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook