ప్రభాస్ “సలార్” హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్…అసలు కారణం ఇదే!

Published on Oct 19, 2021 7:59 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్ ను విడుదల కి సిద్దం చేస్తుండగా, ఆది పురుష్ మరియు సలార్ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు ప్రభాస్. ప్రభాస్ బర్త్ డే మంత్, ప్రభాస్ బర్త్ డే వీక్ అంటూ ఇప్పటికే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కాగా, ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం టైటిల్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందుకు కారణం లేకపోలేదు.

సలార్ చిత్రం నుండి ప్రభాస్ గన్స్ పట్టుకొని కాల్చుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రభాస్ కటౌట్ మరియు, ఊర మాస్ గెటప్ ఎలా ఉంటుందో అర్థ అవుతోంది. ఈ వీడియో వైరల్ అయినప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వీడియో కే ఇంతగా ట్రెండ్ అవుతోంది అంటే, ఇక టీజర్ లేక ట్రైలర్ విడుదల అయితే ఇంకెలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. లీక్డ్ వీడియో చూస్తుంటే ప్రభాస్ కటౌట్ కి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ పుట్టిన రోజు ఈ నెల 23 వ తేదీన ఈ చిత్రం నుండి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :