హై ఎమోషన్స్ తో రెజీనా, అనసూయ ల “ఫ్లాష్ బ్యాక్”…త్వరలో విడుదల!

Published on Jul 20, 2022 5:36 pm IST


రెజీనా, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ఫ్లాష్ బ్యాక్. గుర్తుకొస్తున్నాయి అనేది ఈ సినిమా కి ఉప శీర్షిక. ఈ చిత్రంలో ప్రభుదేవా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతోన్నారు. పి. రమేష్ పిళ్లై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గతంలో రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా ప్రభుదేవా హీరోగా వచ్చిన మై డియర్ భూతం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లకు విశేషమైన స్పందన రాగా, ఈ పోస్టర్‌లతో సినిమా పై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే సినిమాకు సంబంధించిన సీజీ పనులు కూడా పూర్తవుతాయని మేకర్లు తెలిపారు. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాక ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. తెలుగు, తమిళంలో ఏక కాలంలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రంలో హై ఎమోషన్స్ తో ఉండనుంది. యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని మేకర్లు తెలిపారు. రెజీనా ఇందులో ఆంగ్లో ఇండియన్ టీచర్‌ పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది అని దర్శక నిర్మాతలు తెలిపారు. శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు రాశారు. నందు తుర్లపాటి సంభాషణలు అందించారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :