మరో అవకాశం దక్కించుకున్న రెజినా
Published on Feb 20, 2018 9:56 am IST

దక్షిణాది హీరోయిన్లు తరచు బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం పరిపాటే. అలా బాలీవుడ్ ప్రయత్నాలు చేసిన హీరోయిన్ల జాబితాలో రెజినా కూడా ఉన్నారు. గతంలో ఈమె అమితాబ్, అనిల్ కపూర్ ల ‘ఆంఖేయిన్ -2’ తో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టాల్సింది. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ కాస్త ఆగిపోయింది. దీంతో రెజినా హిందీ కలలకు ఫులుస్టాప్ పడ్డట్టేనని అందరూ అనుకున్నారు.

కానీ ఇప్పుడామెకు బీ టౌన్లో అడుగుపెట్టేందుకు మరో ఛాన్స్ దొరికింది. రాజ్ కుమార్ రావ్, అనిల్ కపూర్, జూహి చావ్లాలు కలిసి చేస్తున్న ‘ఏక్ లడ్కీ కో దేఖా తొహ్ ఐసా లగా’ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రెజినాను ఎంపిక చేశారట. దర్శకుడు షెర్లి చోప్ర ధర్ ఆడిషన్స్ చేసిన తర్వాతే రెజినాను ఫైనల్ చేశారట. రెజినా కూడ సౌత్లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆడిషన్స్ కు హాజరయ్యారట.

 
Like us on Facebook