రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రవి తేజ ‘నేల టికెట్’ !

మాస్ మహారాజ రవితేజ తాజా చిత్రం ‘నేల టికెట్’. ఈ సినిమాను ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా యొక్క మాస్ టైటిల్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ సినిమా కూడ ప్రేక్షకుల్ని అలరిస్తుందని తెలుస్తోంది.

ఇప్పటికే 80 శాతం షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం మే 24వ ప్రేక్షకుల ముందుకురానుంది. మిగిలి ఉన్న మూడు పాటల్ని టీమ్ త్వరలోనే పూర్తి చేయనుంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శక్తి కాంత్ సంగీతాన్ని అందిస్తుండగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.