నితిన్, పవన్ కళ్యాణ్ ల సినిమా రిలీజ్ ఎప్పుడంటే !

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, తన తండ్రి సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ ను పరిశీలిలనలో ఉంది. .

ఇకపోతే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 12న రిలీజ్ చేసి టీజర్ ను ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా విడుదలచేస్తామని అలాగే చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నితిన్ స్వయంగా ప్రకటించారు. ‘లై’ ఫేమ్ మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ‘థమన్’ సంగీతాన్ని అందిస్తున్నారు.