“బద్రి” నుంచి బ్యూటిఫుల్ ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్.!

Published on Apr 20, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొట్టిన మరో బ్లాక్ బస్టర్ హిట్ “బద్రి”. పవన్ కు పవర్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఈ చిత్రం నుంచే స్టార్ట్ అయ్యింది. మరి ఈ సినిమాతోనే తన కెరీర్ ను ఆరంభించిన మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక దాని తర్వాత మరొకటి హిట్ కొడుతూ ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ను నమోదు చేశారు.

అయితే ఈ చిత్రంలో పవన్ సరసన అమీషా పటేల్ మరియు రేణు దేశాయ్ లు హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గానే కాకుండా పవన్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పని చేసిన రేణు దేశాయ్ ఈరోజుతో బద్రి సినిమా వచ్చి 21 ఏళ్ళు పూర్తి కావడంతో అప్పటి ఓ బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేశారు. ఈ సినిమాలో హిట్ సాంగ్ “హే చికితా” షూట్ లో గన్ పట్టుకొని ఉన్న పవన్ ముందు దుప్పట్టాలో తాను ఉన్న ఫోటోను షేర్ చేసి అప్పటి మెమొరీస్ ను మళ్ళీ పెన వేసుకున్నారు.

సంబంధిత సమాచారం :