“సలార్” నుండి ‘రాజమన్నార్’ రాబోతున్నాడు !

“సలార్” నుండి ‘రాజమన్నార్’ రాబోతున్నాడు !

Published on Aug 22, 2021 11:56 AM IST


యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ – నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న “సలార్” నుండి ఒక స్పెషల్ అప్ డేట్ వచ్చింది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సలార్ నుండి ‘రాజమన్నార్’ రివీల్ కాబోతున్నాడు అంటూ హోంబేలె పిక్చర్స్ వారు అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ను పెట్టాడు ప్రశాంత్ నీల్. ఆ సాంగ్ ను స్టార్ హీరోయిన్ ‘తమన్నా’ చేత చేయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సలార్ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయిస్తున్నాడు.

కాగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ భారీ సినిమాకి రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబేలె పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు