రేయ్ సెన్సార్ : ‘ఏ’ సర్టిఫికెట్, 41కట్స్!

రేయ్ సెన్సార్ : ‘ఏ’ సర్టిఫికెట్, 41కట్స్!

Published on Mar 24, 2015 12:03 PM IST

rey
సాయి ధరమ్ తేజ్ హీరోగా, వై. వీ.ఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా.. ‘రేయ్’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికి థియేటర్ల ముందుకు రానుంది. మార్చి 27న రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజున ఈ సినిమా విడుదల కానుంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా విడుదలకు మోక్షం కలిగింది. ఇక ‘రేయ్’కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు గత నెల 27నే ముగిశాయ్.

168 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ‘ఏ’ (పెద్దలకు మాత్రమే..) సర్టిఫికెట్ జారీ చేశారు. ఏ సర్టిఫికెట్ జారీ అయ్యాక కూడా ఈ సినిమా 41 చోట్ల కత్తిరింపులకు గురవ్వడం విశేషం. పూర్తి స్థాయి లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఎక్కువగా యూత్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. యూత్ పద, భావజాలం అతిగా ఉన్నందున్న 41 కత్తిరింపులు ఉన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతానికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న తేదీనే విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానుల్లో జోరు పెంచగా, ఈమధ్యనే విడుదల చేసిన పవనిజం సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Rey-S

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు