రూ. 340 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ గోపాల్ వర్మ ‘న్యూక్లియర్’ !

7th, November 2016 - 11:13:28 AM

nuclear
నిన్న మొన్నటి దాకా ‘బాహుబలి’ చిత్రమే ఇండియాలో భారీ బడ్జెట్ చిత్రమని అనుకున్నాం కానీ దానికన్నా ఎక్కువ బడ్జెట్ తో శంకర్ – రజనీల ‘రోబో2.0’ తెరకెక్కుతోంది. మరిప్పుడు వాటి రెండింటినీ మించి రూ.340 కొట్ల భారీ బడ్జెట్ తో రాంగోపాల్ వర్మ తన సినిమాని అనౌన్స్ చేసేశాడు. అదే ‘న్యూక్లియర్’. ఈ సినిమా గురించి ఆర్జీవీ మాట్లాడుతూ ‘నేనిప్పటి వరకూ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ సబ్జక్ట్స్ చదివాను కానీ ఫస్ట్ టైమ్ న్యూక్లియర్ సబ్జెక్టు వైపు వెళుతున్నాను. ఇది ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రం. ఎందుకంటే ఈ సబ్జెక్టు కి ఆ బడ్జెట్ కావాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రతి మనిషి మెదడులో బలంగా ఉన్న సమస్య టెర్రరిజం’ అన్నారు.

అలాగే ‘ఒకవేళ టెర్రరిస్టుల చేతికి న్యూక్లియర్ బాంబు వెళ్లి అది ముంబై సిటీలో బ్లాస్ట్ అయితే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ప్రపంచం నాశనమవుతుంది. అదే ఈ సినిమాలోని కథ’ అన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని నిర్మించనున్న సిఎంఏ గ్లోబల్ సంస్థ ‘చాలా డిస్కషన్ల తరువాత ఈ సబ్జెక్టు ని వర్మ అర్థం చేసుకున్న విధాన్న్నాయి బట్టి ఆయన అయితేనే ఈ సినిమాకి సరోపోతారని నిర్ణయించుకున్నాం’ అని తెలిపింది. ఇకపోతే ఈ చిత్రాన్ని అమెరికా, రష్యా, యమెన్, ఇండియా దేశాల్లో చిత్రీకరిస్తామని, ఇందులో ఇండియా, అమెరికా, చైనా, రష్యా నటులు నటిస్తారని వర్మ పేర్కొన్నారు.