డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన మూడు ముఖ్య పాత్రల్లో ఒకటైన శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ ను వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. 1997 లో జగపతి పాత్రలో నవీన్ చంద్ర లుక్ ని ఇప్పటికే నటుడు విశ్వక్ సేన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం లో శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ ను ఆర్జీవీ విడుదల చేయడం తో ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం లో శ్రీకాంత్ అయ్యంగార్ చారి పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కోటి అందిస్తున్నారు.


