“1997” చిత్రం నుండి శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ ను విడుదల చేసిన ఆర్జీవీ!

Published on Aug 19, 2021 8:00 am IST

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ముడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్ ని యంగ్ అండ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసారు. తాజగా 1997 చిత్రంలోని మరో ముఖ్యమైన శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, టైటిల్ చాలా బాగుంది, 1997 లో ఏమి జరిగింది అన్న క్యూరియాసిటీ నెలకొంది, ముఖ్యంగా రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసినట్టు ఉంది, ఈ సినిమా హీరో, దర్శకుడు మోహన్ కు ఈ సినిమా సక్సెస్ అయి అతనికి మంచి పేరు తేవాలి, ఈ సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అని అన్నారు.

నటుడి శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ, మా అభిమాన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి చేతులమీదుగా 1997 సినిమాలోని తన లుక్ ని విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వర్మ గారికి థాంక్స్ చెబుతున్నా అని అన్నారు. ఈ సినిమాతో హీరోగా, దర్శకుడిగా చేస్తున్న మోహన్ కు ఈ సినిమా ద్వారా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

హీరో, దర్శకుడు డా. మోహన్ మాట్లాడుతూ, ముందుగా వర్మ గారికి థాంక్స్, సినిమాలో ఉన్న మూడు ముఖ్యపాత్రల్లో ఒకటైన శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రను రివీల్ చేసినందుకు మా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారికి నా ధన్యవాదాలు అని అన్నారు. వర్మగారి సినిమాలంటే చాలా ఇష్టమని, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఓ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని బర్నింగ్ ఇష్యుని తీసుకుని దానికి కమర్షియల్ హంగులతో ఈ సినిమా చేశానని అన్నారు. ఈ సినిమా విషయంలో తనకు ప్రతి విషయంలో సపోర్ట్ అందించిన కోటి గారికి, అలాగే హీరో నవీన్ చంద్రకు థాంక్స్ అని అన్నారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది అని అన్నారు.

సంబంధిత సమాచారం :