తన సినిమా కోసం ఆర్జీవీ వాయిస్ ఓవర్ !

Published on Dec 3, 2018 10:50 am IST

నూతన దర్శకుడు సిద్దార్థ దర్శకత్వంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందింన చిత్రం ‘భైరవగీత’. ఈ చిత్రం నిజంగా జరిగిన ఓ హింసాత్మక ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిందని, ఈ సినిమా ఆసాంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం తెలుగులో డిసెంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కథను ఆర్జీవీ తన వాయిస్ ఓవర్ తోనే స్టార్ట్ చేస్తారట. కథలోని ముఖ్యమైన మలుపులను తన నెరేట్ చేస్తూ వర్మ చెప్పనున్నారని తెలుస్తోంది.

రాయలసీమ నేపధ్యంలో 1991 నాటి కాలంలో ఈ ‘భైరవగీత’ చిత్రం తెరకెక్కింది. ‘తగరు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ హీరోగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి దర్శకుడు వేరే అయినప్పటికీ.. ఈ చిత్రం మాత్రం పూర్తిగా వర్మ శైలిలోనే తెరకెక్కినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :