మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పిన రితికా సింగ్ !


బాక్సర్ నుండి నటిగా మారిన రితికా సింగ్ మొదటి చిత్రం ‘సాలా ఖద్దూస్’తోనే అందరినీ మెప్పించింది. ఈ చిత్రాన్ని ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగులో కూడా ‘గురు’పేరుతో రూపొందించారు. విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రితిక నటనకుగాను తెలుగు ఆడియన్స్ బాగా ఇంప్రెస్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఆమె తెలుగులో ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలని అనుకున్నారు.

ప్రస్తుతం తమిళంలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రితికా ఎన్ని ఆఫర్స్ వస్తున్నా వాటిలో సరైన వాటిని మాత్రమే ఎంచుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమె హీరో సుధీర్ బాబుతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రాజశేఖర్ డైరెక్ట్ చేస్తారట. ఈ ప్రాజెక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.