డబుల్ ట్రీట్ రెడీ చేసిన ‘రాబిన్‌హుడ్’

డబుల్ ట్రీట్ రెడీ చేసిన ‘రాబిన్‌హుడ్’

Published on May 7, 2025 1:25 AM IST

హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ రాబిన్‌హుడ్ మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేయడంతో వీరి కాంబినేషన్‌పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ, ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 తో పాటు.. జీ తెలుగు ఛానల్‌లోనూ ఒకేరోజు ప్రసారం చేయనున్నారు. మే 10న సాయంత్రం 6 గంటలకు అటు బుల్లితెర టెలికాస్ట్‌తో పాటు జీ5 ఓటీటీలోనూ వరల్డ్ ప్రీమియర్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమాకు ఓటీటీ, బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు