‘రోబో-2’ రోబోకి సీక్వెల్ కాదట !
Published on Oct 11, 2017 1:22 pm IST

దక్షిణాది ప్రేక్షకులు మాత్రమే కాక యావత్ దేశంలోని సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రోబో-2’. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఇప్పటీకి వరకూ అందరూ ఈ సినిమా 2010లో వచ్చిన శంకర్, రజనీల ‘రోబో’ కు సీక్వెల్ అని, కథ దానికి కొనసాగింపుగా ఉంటుందని అనుకున్నారు.

కానీ ఇది సీక్వెల్ కాదని, రోబో, రోబో 2 కు మధ్య సంబంధం లేదని, ఇది పూర్తిగా కొత్త కథని శంకర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ కొత్త కథ ఎలా ఉంటుందో చూడాలనే ఆతురత ప్రేక్షకుల్లో మరీ ఎక్కువవుతోంది. ఈ నెల 27న దుబాయ్ లో భారీ ఎత్తున ఆడియో వేడుక జరుపుకోనున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను డిసెంబర్ నెలలో విడుదల చేయనుండగా చిత్రాన్ని 2018 జనవరిలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

 
Like us on Facebook