రెజీనాతో రొమాన్స్ చాలా బాగుంటుందట !

Published on Feb 13, 2019 8:21 pm IST

సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో ‘ఏక్ లడకీ కొ దేఖా తో ఐసా లగా’ అనే హిందీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో సోనమ్ కపూర్ ప్రేయసిగా రెజీనా కనిపించనుంది. ఎందుకంటే ఈ సినిమాలో సోనమ్, రెజీనా ఇద్దరూ లెస్బియన్స్ , వీరి మధ్య ప్రేమ కథే ఈ సినిమాలో ప్రధాన అంశం అని తెలుస్తోంది.

కాగా తాజాగా తన ప్రేయసిగా నటించిన రెజీనా గురించి సోన‌మ్ కపూర్ మాట్లాడుతూ… రెజీనా ఎప్పుడూ కూల్‌గా ఉంటుంది. తనలో చాలా ప్ర‌తిభ ఉంది. తన ద‌గ్గ‌ర్నుంచి ఎప్పుడూ మంచి ప‌రిమ‌ళం వ‌స్తుంటుంది. దాంతో రెజీనాతో రొమాన్స్ చేయ‌డం చాలా బాగుంది అని చెప్పుకొచ్చింది సోనమ్. మొత్తానికి రెజీనా హీరోలతో పాటు హీరోయిన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

షెల్లీ చోప్రా ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :