మే 17న రొమాంటిక్ క్రిమినల్స్ !

Published on May 11, 2019 12:00 pm IST

పి.సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం లో రూపొందుతున్న చిత్రం రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏ సర్టిఫికెట్ తో ఈ చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందింది. ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ చిత్రాల‌కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాల్ని, ఇంటర్నెట్ అశ్లీలతను చూపించారు. ఈ సినిమా ని శ్రీ ల‌క్ష్మీ పిక్చ‌ర్స్‌, శ్రావ్యా ఫిలింస్ బ్యాన‌ర్ల పై సంయుక్తంగా ఎక్క‌లి ర‌వింద్ర‌బాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More