‘రొమాంటిక్’తో ఆకాశ్ మంచి విజయం అందుకుంటాడు – విజయ్ దేవరకొండ

Published on Oct 23, 2021 1:39 am IST


డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ కలిసి నటిస్తున్న చిత్రం “రొమాంటిక్”. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నేడు వరంగల్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ్ రొమాంటిక్‌ టీమ్‌ అంతా నాకు కావాల్సినవాళ్లు. వీరిలో చాలామంది ‘లైగర్‌’ చిత్రానికి పనిచేస్తున్నారని, లైగర్‌తో 2022లో ఇండియాని షేక్‌ చేయాలని మేం ఫిక్స్‌ అయ్యామని అన్నాడు. ఆకాశ్‌ స్పీచ్‌ విన్నాక తనలో మంచి ఫైర్ ఉందని అనిపించిందని ఈ సినిమాతో ఆకాశ్ మంచి విజయం అందుకుంటాడని భావిస్తున్నానని, కేతిక శర్మ అందం, అభినయంతో ఆకట్టుకునేలా ఉందని అన్నాడు. సునీల్‌ కశ్యప్‌ అందించిన పాటలు బాగున్నాయని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నాడు.

ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా మాట్లాడుతూ వరంగల్ అంటే తనకు చాలా ఇష్టం అని, ఇక నుంచి ప్రతి ఫంక్షన్ వరంగల్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటామని అన్నాడు. ఇకపోతే ఈ సినిమాను అనిల్ చాలా బాగా డైరెక్ట్ చేసాడని, ఆకాష్, కేతిక , రమ్యకృష్ణ అందరూ అదరగొట్టారని, మంచి లవ్ స్టోరీ కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందేనని అన్నారు.

సంబంధిత సమాచారం :

More