ఆస్కార్ కి చేరువలో “RRR”..జక్కన్నకి ప్రఖ్యాత అవార్డుతో.!

Published on Dec 3, 2022 8:00 am IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న టాలీవుడ్ “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఇప్పుడుకీ ప్రపంచ సినిమా దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసి భారీ ఖ్యాతిని గడించింది.

మరి ఇలాంటి మాస్టర్ పీస్ ని తెరకెక్కించిన రాజమౌళికి అయితే ప్రపంచ ఆడియెన్స్ నుంచి యూనానిమస్ అప్లాజ్ అందుకుంటూ లేటెస్ట్ గా అయితే ప్రపంచ ప్రఖ్యాత క్రిటిక్ అవార్డ్స్ అయినటువంటి ఎన్ వై ఎఫ్ సి సి(న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్) నుంచి బెస్ట్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ రాజమౌళి పేరుని అనౌన్స్ చేసింది.

దీనితో రాజమౌళి మరో అద్భుతమైన ఘనతను నమోదు చేయగా ఈ అవార్డు మోస్ట్ ప్రపంచ దిగ్గజ అవార్డు ఆస్కార్ కి ఈ చిత్రం సహా రాజమౌళి అతి చేరువలో ఉన్నట్టుగా టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరగనుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :