జపాన్లో సెన్సేషనల్ రన్ తో దూసుకెళ్తున్న “RRR”.!

Published on Jan 28, 2023 8:01 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా ఆస్కార్ వరకు టాలీవుడ్ సినిమాకి వన్నె తీసుకొచ్చింది. మరి ఈ భారీ సినిమా నమోదు చేసిన ఎన్నో వండర్స్ లో అయితే జపాన్ రిలీజ్ వసూళ్లు కూడా ఒకటి. అక్కడ ఈ చిత్రం రిలీజ్ అయ్యి సుమారు 14 వారాలు అయినప్పటికీ కూడా అంతకంతకూ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి తప్ప డ్రాప్ అనేది కనిపించట్లేదట.

మరి లేటెస్ట్ గా ఈ చిత్రం అక్కడ 715 మిలియన్ జపాన్ యిన్స్ ని క్రాస్ చేసి ఇంకా సెన్సేషన్ రన్ తో దూసుకెళ్తుందట. కానీ ఫైనల్ గా మాత్రం ఈ చిత్రం ఊహించని మార్క్ ని అందుకున్నా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రం జపాన్ బాక్సాఫీస్ దగ్గర ఏ ఇండియన్ సినిమా కూడా నెలకొల్పని భారీ రికార్డులు సెట్ చేసింది. మరి ఈ స్పీడ్ లో ఫైనల్ రన్ 1 బిలియన్ లేదా అంతకన్నా ఎక్కువే ఉంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :