వైరల్ : జపాన్ ఫేమస్ మ్యాగిజైన్ పై “RRR” హీరోస్.!

Published on May 18, 2023 12:00 pm IST

గత ఏడాది మన టాలీవుడ్ నుంచి వచ్చి భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు తో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మాసివ్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు కూడా నెగ్గిన ఈ చిత్రం జపాన్ దేశంలో అయితే 200 రోజులు కంప్లీట్ అయ్యినా కూడా రికార్డు వసూళ్లు కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపుతుంది.

ఇక జపాన్ లో అయితే రామ్ చరణ్ కి గాని ఎన్టీఆర్ కి గాని భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరిపై అయితే లేటెస్ట్ గా జపాన్ కి చెందిన ప్రముఖ మ్యాగజైన్ ‘ఆనన్’ వారు అయితే వారిపై ఓ బ్యూటిఫుల్ పిక్ ని పొందుపరిచారు. మరి ఇద్దరు హీరోస్ కూడా తమదైన లుక్స్ తో అదరగొట్టగా వీరి లుక్స్ అయితే ఫ్యాన్స్ కి ఇప్పుడు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. దీనితో ఈ ఫేమస్ మ్యాగజైన్ పోస్టర్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :