‘జూ ఎన్టీఆర్’ ఎంతో త్యాగం చేశాక ఇది సాధించాం !

‘జూ ఎన్టీఆర్’ ఎంతో త్యాగం చేశాక ఇది సాధించాం !

Published on Jul 9, 2019 6:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సినిమలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చమటోడుస్తున్నాడు. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు చేస్తున్నాడు.

కాగా ఎన్టీఆర్ లెగ్‌ ఎక్సర్‌ సైజ్‌లకు సంబంధించిన ఫోటోను లాయిడ్ తన ఇన్‌ స్టాగ్రామ్‌ పోస్ట్ చేస్తూ.. ఎంతో త్యాగం చేశాక ఇది సాధించాం అని కామెంట్ కూడా పెట్టాడు. తరువాత షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారట. అందుకే ఎన్టీఆర్ ఎక్సర్‌ సైజ్‌ లను బాగా చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కు బ్రిటిష్ సైనికులకు మధ్య వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలుస్తాయట.

ఇక సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు