ఆర్ ఆర్ ఆర్ పై లేటెస్ట్ అప్డేట్…!

Published on Jul 24, 2019 8:29 am IST

జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎ్‌స.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నగర శివారులో వేసిన బ్రిడ్జ్‌ సెట్‌పై పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు . ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే,చిత్ర యూనిట్ డెహ్రాడూన్ వెళ్లనుందని సమాచారం. అక్కడ ప్రత్యేకంగా నెలకొల్పుతున్న ఓ సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారనీ, ఇప్పటికే ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి పలువురు డెహ్రాడూన్‌ చేరుకున్నాని తెలుస్తుంది.

కాగా నిన్నటి నుండి “ఆర్ ఆర్ ఆర్” లో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ పై ఆసక్తికరవార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే హాలీవుడ్‌ నటి ఎమ్మా రాబర్ట్స్‌ను తారక్‌కు జోడీగా ఎంపిక చేశారని, గత నెలలో అమెరికా వెళ్లిన రాజమౌళి ఆమెతో చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం వున్నది అనేది తెలియాల్సివుంది.

డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, అలియా భట్,అజయ్ దేవగణ్, సముద్ర ఖని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :