కన్ఫ్యూజన్ లో “RRR” రిలీజ్ డేట్.?

Published on Sep 30, 2021 10:50 am IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కించిన “రౌద్రం రణం రుధిరం” సినిమాకి కూడా ఒక ప్రధాన స్థానం ఉంది. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది అంతకంతకూ ఆసక్తిగా మారుతుండగా మేకర్స్ ఈ డేట్ విషయంలో కాస్త కఫ్యూజన్ గా ఉన్నారా అనిపిస్తుంది.

అయితే సినీ వర్గాల్లో స్ట్రాంగ్ టాక్ ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా దింపాలని సిద్ధం అయ్యారని టాక్ రాగా అప్పుడుకి ఆల్రెడీ రేస్ లో ఉన్న మరో పాన్ ఇండియన్ సినిమా ‘రాధే శ్యామ్’ నిన్ననే తమ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని జనవరి 14నే అని ఫిక్స్ చెయ్యడంతో “RRR” సినిమా విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి అయితే జనవరి 8న అని బజ్ వినిపిస్తుంది కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :