రామ్ చరణ్ మీద కోర్టు సన్నివేశాల చిత్రీకరణ

Published on Nov 13, 2019 12:24 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించిన అప్డెట్స్ చాలా తక్కువగా బయటకు వస్తున్నాయి. చిత్ర టీమ్ చాలా అరుదుగా షూటింగ్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతుండటంతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువవుతోంది. వారి కోసమే తాజాగా ఒక అప్డేట్ బయటికొచ్చింది.

అదేమిటంటే ప్రస్తుతం సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందట. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మీద బ్రిటిష్ కోర్టు నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. మరొక హీరో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ డిసెంబర్ ఆఖరులో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.

ఇకపోతే సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జూన్ 30న విడుదల చేయనున్నారు. ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దేశ వ్యాప్తంగా అన్ని భాషల సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం :

More