‘ఆర్‌ఆర్‌ఆర్’ షూట్ పై కీరవాణి ట్వీట్ !

Published on Sep 21, 2020 1:12 pm IST

రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ షూటింగ్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా అప్ డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సోషల్ మీడియాలో తెలిపారు. ఓనెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా కీరవాణి సమాధానం ఇస్తూ.. నాన్ కోవిడ్ నోట్ లో భాగంగా, ప్రస్తుతం నేను రెండు సినిమాల కోసం పని చేస్తున్నాను, ఒకటి క్రిష్ యొక్క సొంత సినిమా, మరొకటి కె. రాఘవేంద్రరావు నిర్మాణంలో వస్తోన్న సినిమా. ఇక అందరూ ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ పనులు త్వరలో తిరిగి ప్రారంభమవ్వనున్నాయి” కీరవాణి ట్వీట్ చేశారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా తదుపరి షెడ్యుల్ లో ఒలివియా మోరిస్ అండ్ ఎన్టీఆర్ కు మధ్య నడిచే సీన్స్ ను షూట్ చేయనున్నారట. ఎన్టీఆర్ మీద ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేయడానికి ఈ సీన్స్ లోని కొన్ని షాట్స్ అవసరం అవుతాయట. అందుకే ముందుగా ఈ సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పై ఆరంభం నుండి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More