రుద్రమదేవికి సూపర్బ్ బాక్స్ ఆఫీసు ఓపెనింగ్స్

రుద్రమదేవికి సూపర్బ్ బాక్స్ ఆఫీసు ఓపెనింగ్స్

Published on Oct 11, 2015 11:36 AM IST

Rudhramadevi

కాకతీయ వీరణారి రాణీ రుద్రమదేవి జీవిత కథని ఆధారం చేసుకొని భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క, అల్లు అర్జున్, రానా డబ్బుబాటి లాంటి స్టార్ నటీనటులు నటించిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు టాక్ అటు ఇటుగా వచ్చినా సినిమాకి మాత్రం ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. మొదటి రోజు ఆంధ్ర, తెలంగాణలో కలుపుకొని 9 కోట్ల పైనే షేర్ సాధించిన రుద్రమదేవి రెండవ రోజు కూడా దాదాపుగా 5 కోట్ల పైనే షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. అన్ని ఎరియల్లోనూ మంచి కలెక్షన్స్ వస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రుద్రమదేవి సినిమా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. ప్రీమియర్ షోస్ మరియు మొదటి రోజు కలిపి $305,908K (1.98కోట్లు) సాధించిన రుద్రమదేవి రెండవ రోజు అనగా శనివారం $203K షేర్ సాధించింది. అనగా మొదటి రెండు రోజుల్లో రుద్రమదేవి హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఓవరాల్ గా మొదటి రెండు రోజుల్లో సుమారు $508,908K (3.2 కోట్లకి పైనే) సాధించింది. ఈ రోజు కూడా ఇదే జోరును కొనసాగిస్తోందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఓవర్సీస్ లో 2డి కంటే 3డి కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. లోకల్ లో కూడ 3డి వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇండియాలోనే మొట్టమొదటి సారిగా స్టీరియో స్కోపిక్ హిస్టారికల్ 3డిఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ అందించారు. రుద్రమదేవిగా అనుష్క మరియు గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ చూపిన పెర్ఫార్మన్స్ సినిమాకి హైలైట్ అయ్యింది.

తాజా వార్తలు